Thu Mar 05 2026 15:43:34 GMT+0530 (India Standard Time)
ఎల్లుండి కృష్ణ అంత్యక్రియలు.. కారణమిదే !
వాస్తవానికి రేపే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. కానీ.. అష్టమి కావడంతో ఎల్లుండి అనగా నవంబర్ 17, గురువారం..

సూపర్ స్టార్ కృష్ణ (79) గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్తతో.. అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులు నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కృష్ణ అంత్యక్రియలను ఎల్లుండి నిర్వహించాలని ఘట్టమనేని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
వాస్తవానికి రేపే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. కానీ.. అష్టమి కావడంతో ఎల్లుండి అనగా నవంబర్ 17, గురువారం అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ రోజు, రేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సూపర్ స్టార్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Next Story

