Mon Mar 16 2026 07:40:59 GMT+0530 (India Standard Time)
విజయకృష్ణ నిలయానికి కృష్ణ పార్ధీవ దేహం
సూపర్ స్టార్ హీరో కృష్ణ పార్ధీవ దేహాన్ని మరికాసేపట్లో ఆయన సొంత ఇల్లు విజయకృష్ణ నిలయానికి తరలించనున్నారు

సూపర్ స్టార్ హీరో కృష్ణ పార్ధీవ దేహాన్ని మరికాసేపట్లో ఆయన సొంత ఇల్లు విజయకృష్ణ నిలయానికి తరలించనున్నారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో ఇప్పటికే కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు కలిసి తమ సంతాపాన్ని ప్రకటించారు. కొద్దిపాటి కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం కృష్ణ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామని కాంటినెంటల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
మల్టిబుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో....
గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన కృష్ణను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా కొన్ని అవయవాలు పనిచేయడం మానేశాయని తెలిపారు. ఆయనకు మరింత మెడికేషన్ చేసి ఇబ్బంది పెట్టడం లేని కుటుంబ సభ్యులు ప్రశాంతంగా కన్నుమూయాలని భావించారని డాక్టర్లు తెలిపారు. తెల్లవారు జామున 4.10 గంటలకు కృష్ణ కన్నుమూశారని వైద్యులు తెలిపారు.
Next Story

