Wed Jan 21 2026 07:09:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్... రవి ఎలిమినేట్ అయింది ఇలా...?
సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వృధా అయింది. కాజల్ కు ఇచ్చినా ఆమె ఆడియన్స్ ఓటింగ్ తో బయటపడింది

సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వృధా అయింది. కాజల్ కు ఇచ్చినా ఆమె ఆడియన్స్ ఓటింగ్ తో బయటపడింది. చివరకు యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది కాజల్ వల్లనే. ఆమె ఆరోజు యాని మాస్టర్, సిరి ఫొటోలను కాల్చేయాలని నిర్ణయం తీసుకోకుంటే సన్నికి ఈపాస్ లభించేది కాదు. అయితే ముందుగానే పాస్ ను ఉపయోగించాలని నాగార్జున కోరడంతో సన్నీ తన కోసం కాకుండా కాజల్ కోసం అక్కడ ఉంచాడు.
ఓట్లను చూపించాాలని.....
కానీ చివరకు కాజల్ ఆడియన్స్ ఓట్లతో బయటపడింది. చివరకు యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. రవి ఎలిమినేషన్ ఉహించనది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆడియన్స్ ఓట్లను తమకు చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చెత్తగా ఆడుతున్న షణ్ముఖ్ లాంటి వారిని బిగ్ బాస్ ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలను రవి ఫ్యాన్స్ చేస్తుండటం విశేషం.
Next Story

