ఫ్రీగా సుమ కొడుకు సినిమా టికెట్లు.. ఏయే థియేటర్లలో అంటే?
రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల
![roshankanakala, sumakanakala, bubblegummovie, bubblegummovietickets, tickets, free movie tickets, movie news, tollywood movies, suma mews roshankanakala, sumakanakala, bubblegummovie, bubblegummovietickets, tickets, free movie tickets, movie news, tollywood movies, suma mews](https://www.telugupost.com/h-upload/2023/12/30/1574805-bubble-gum.webp)
రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అయిన మూవీ ‘బబుల్గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల అయింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు స్టూడెంట్స్ కి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు. సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్స్ లో 18ప్లస్ స్టూడెంట్స్ కి ఈ సినిమా ఫ్రీగాచూసే అవకాశం ఇచ్చారు. వైజాగ్ చిత్రాలయ మాల్, భీమవరం విజయలక్ష్మీ థియేటర్, విజయవాడ లైలా మాల్, ఎన్వీఆర్ వేల్రామ్స్ థియేటర్ తిరుపతిలో షోలు ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు. ఆదివారం హైదరాబాద్ శాంతి, మూసాపేట్ లక్ష్మీకళ, కొంపల్లి సినీ ప్లానెట్, అమీర్ పేట AAA సినిమాస్, కుషాయిగూడ తాళ్ళూరి థియేటర్ లలో సినిమాను ఉచితంగా చూడొచ్చు.