బన్నీ – సుక్కు సినిమాలో బోలెడన్ని విశేషాలున్నాయ్
సుకుమార్ ఎట్టకేలకు అల్లు అర్జున్ సినిమా ని మొదలెట్టాడు.స్క్రిప్ట్ వర్క్ మీదే కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్న సుకుమార్.. ఫుల్ స్క్రిప్ట్ తో ఇప్పుడు సెట్స్ మీదకెళ్ళాడు. [more]
సుకుమార్ ఎట్టకేలకు అల్లు అర్జున్ సినిమా ని మొదలెట్టాడు.స్క్రిప్ట్ వర్క్ మీదే కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్న సుకుమార్.. ఫుల్ స్క్రిప్ట్ తో ఇప్పుడు సెట్స్ మీదకెళ్ళాడు. [more]

సుకుమార్ ఎట్టకేలకు అల్లు అర్జున్ సినిమా ని మొదలెట్టాడు.స్క్రిప్ట్ వర్క్ మీదే కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్న సుకుమార్.. ఫుల్ స్క్రిప్ట్ తో ఇప్పుడు సెట్స్ మీదకెళ్ళాడు. అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా అల వైకుంఠపురములో షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ సినిమా కోసం పూర్తిగా ప్రిపేర్ అవుతాడు. అయితే సుకుమార్, అల్లు అర్జున్ తో తియ్యబోయే సినిమా కోసం స్క్రిప్టుతో పాటుగా లొకేషన్స్ ని కూడా సెట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ ఫ్రీ అవడమే సుకుమార్, అల్లు అర్జున్ ని తీసుకుని థాయిలాండ్ వెళ్తాడని సమాచారం అల్లు అర్జున్ – సుక్కు సినిమా నల్లమల అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఉండబోతుందని ప్రచారం లో ఉంది.
అయితే నల్లమల అడవులను వదిలేసి సుకుమార్ థాయిలాండ్ లోని దట్టమైన అడవులలో ఫారెస్ట్ లో సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపాలని నిర్ణయించారట. మరి తిరుపతి, చిత్తూరు లను వదిలేసి సుకుమార్ థాయిలాండ్ అడవులను ఎందుకు ఎంచుకున్నాడో… ఇంకా ఈ సినిమాలో రంగస్థలంతో అనసూయకి అదిరిపోయే కేకేరెక్టర్ ఇచ్చిన సుకుమార్ ఇపుడు అల్లు అర్జున్ సినిమా కోసం కూడా ఓ కీలక పాత్ర ఇవ్వనున్నాడనే ప్రచారం ఉంది. ఇక అల్లు అర్జున్ , రష్మిక లు ఈ సినిమాలో చిత్తూరు ప్రాంత వాసులుగా కనిపించబోతున్నారు.

