Mon Dec 09 2024 09:38:21 GMT+0000 (Coordinated Universal Time)
మీ తండ్రిని అమితంగా ప్రేమిస్తున్నారా.. ఈ సినిమా చూస్తే ఆ ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది
నాన్న.. మనల్ని ఎప్పుడూ వెంటాడే ఎమోషన్
నాన్న.. మనల్ని ఎప్పుడూ వెంటాడే ఎమోషన్. చిన్న వయసులో మనకు నాన్ననే సూపర్ హీరో. పెద్ద అవుతూ ఉండేకొద్దీ నాన్న చేసిన త్యాగాలు, మన కోసం చేసిన పనులను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక నాన్న సెంటిమెంట్ సినిమాల్లో కూడా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అలాంటి సినిమా మరొకటి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ ఉంది. ఆ సినిమానే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కన్నీళ్లు తెప్పించకమానదు.
మా నాన్న సూపర్ హీరో సినిమా సుధీర్ బాబు ప్రధాన పాత్రలో అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించి చిత్రం. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇక ZEE5 లో కూడా సినిమా అందుబాటులోకి రానుంది. నవంబర్ 15, 2024 నుండి సినిమా స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో సాయాజీ షిండే, సాయి చంద్, అర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Next Story