Wed Dec 24 2025 10:04:52 GMT+0000 (Coordinated Universal Time)
అవుకు రాజు పాత్రలో కన్నడ నటుడు సుదీప్

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో.. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకుడిగా నిర్మిస్తున్న చిత్ర సైరా నరసింహారెడ్డి. హై టెక్నికల్ వాల్యూస్‌తో.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇందులో కన్నడ సూపర్‌స్టార్, అభినయ చక్రవర్తి సుదీప్ అవుకు రాజు అనే పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 2న సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అవుకు రాజు గా సుదీప్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Next Story

