Fri Dec 05 2025 12:23:24 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : త్రీడేస్ మోర్... మెగా అభిమానులకు ముందే వచ్చిన పండగ
మెగా అభిమానులకు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి గుడ్ న్యూస్ చెప్పారు

మెగా అభిమానులకు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి గుడ్ న్యూస్ చెప్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ జిరంజీవి పేరు శంకర వరప్రసాద్ అని ఆయన ట్వీట్ చేయడం ఫ్యాన్స్ కు పండగలాంటి కబురు. అయితే అదే పేరును ఆయన ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మూడు టైటిళ్లు అనిల్ రావిపూడి రివీల్ చేశారు. అందులో ఒకటి మన శివశంకర వరప్రసాద్ గారూ, సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం, బాస్ తో ఈ పండగ రఫ్ఫాడిస్తున్నాం అంటూ మూడు పేర్లను బయట పెట్టారు.
కామెడీ,మాస్ సినిమాగా...
అయితే ఇందులో మన శంకర వరప్రసాద్ గారూ అనే టైటిల్ దాదాపు ఖరరాయినట్లు తెలిసింది. ట్యాగ్ లైన్ మాత్రం ఈ పండగకి వస్తున్నాం అని ఫిక్స్ చేసినట్లు ఫిలిం వర్గాల టాక్. అనిల్ రావిపూడి మెగా అభిమానులను మాస్ + కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభమయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. అందుకే వేగంగా షూటింగ్ ప్రక్రియ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవాలని ఆయన అంతా సిద్ధం చేసుకున్నారు.
ఈ నెల 22వ తేదీన...
ఈ మూవీలో చిరంజీవి ఒరిజినల్ నేమ్ వరప్రసాద్ పేరును వాడుతూ అభిమానులను స్క్రీన్ వైపునకు మరింతగా లాగేసుకోవడానికి అనిల్ రావిపూడి చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ప్రయత్నిస్తుందో చూడాలి. యాక్షన్ + కామెడీ మూవీ కావడంతో సూపర్ డూపర్ హిట్ అయి బాక్సాఫీసును బద్దలు కొట్టడం ఖాయమన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. అయితే చిరు పుట్టిన రోజు అంటే ఆగస్టు 22వ తేదీన టైటిల్ ను అనిల్ రావిపూడి రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో టైటిల్ ను విడుదల చేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నారని తెలిసింది.
Next Story

