Mon May 06 2024 21:26:41 GMT+0000 (Coordinated Universal Time)
జపాన్ లో సుబ్బరాజు క్రేజ్ చూశారా..?
బాహుబలి - 2 ప్రపంచవ్యాప్తంగా ఎంతపెద్ద విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. ముఖ్యంగా జపాన్ లో అక్కడి ప్రజలు బాహుబలికి ఫిదా అయిపోయారు. అందునా హీరో, విలన్ కాకుండా కుమారవర్మ పేరుతో కామెడీ పాత్ర వేసిన సుబ్బరాజుకి అభిమానులుగా మారిపోయారు. అయితే, ఇటీవల సుబ్బరాజు జపాన్ కి వెళ్లారు. బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ కు కుమారవర్మ వేషంలోనే వెళ్లే థియేటర్ లో సందడి చేశారు. సుబ్బరాజు రాక గురించి తెలుసుకున్న ఆయన జసాన్ అభిమానులు ఆయన ఫోటోలు పట్టుకుని వచ్చి కేరింతలు కొట్టారు. సుబ్బరాజు కూడా తన అభిమానులతో సెల్ఫీలు దిగారు. కత్తితో చెక్క మొద్దును నరికే ఫీట్ కూడా చేసి చూపించారు. ఈ ఫోటోలను బాహుబలి టీమ్ ట్వీట్టర్ లో పెట్టింది. దీంతో అవి తెగ వైరల్ గా మారుతున్నాయి.
Next Story