Fri Dec 05 2025 21:50:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ "తగ్గేదేలే"
స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు

స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏపీలోనే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడులోనూ అల్లు అర్జున్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో వారంతా ఇప్పుడు పుష్ప సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్ గా నటించే ఈ సినిమా డిసెంబరు 17వ తేదీన థేయేటర్లలో విడుదల కానుంది.
తమిళనాడులోనే....
దీంతో మేకర్స్ ప్రీ రిలీజెస్ బిజినెస్ లను ప్రారంభించారు. పుష్ప సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు ఫిలింనగర్ టాక్. తమిళనాడులోనే 6.5 కోట్లకు అమ్ముడు పోయాయి. మళయాళంలోనూ అధిక ధరకు కొనుగోలు చేశారని వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద మేకర్స్ పుష్ప సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేశారన్న టాక్ వినపడుతుంది.
- Tags
- allu arjun
- Pushpa
Next Story

