Fri Dec 05 2025 16:54:34 GMT+0000 (Coordinated Universal Time)
Allu Ajun : అల్లు వారి అబ్బాయిని చూశారా... మరోసారి అదిరగొట్టాడుగా?
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంపిక చేసుకునే సినిమాలు వెరైటీ గా ఉంటాయి

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంపిక చేసుకునే సినిమాలు వెరైటీ గా ఉంటాయి. కథనంతో పాటు ఆకట్టుకునే పాత్రలకే అల్లు అర్జున్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఆయన సినిమాల ఎంపిక అంతా అలాగే జరుగుతుంటుంది. మంచి కథనంతో పాటు యాక్షన్ తో కలగలిసిన మూవీ చేయడానికి అల్లు అర్జున్ ఎక్కువగా ఇష్టపడతారంటారు. అందుకే వైవిధ్యమైన పాత్రలను చేయడంలో టాలీవుడ్ లో ముందుండే నటుడు ఎవరంటే అందరి వేళ్లూ అల్లు అర్జున్ వైపు మాత్రమే చూపుతాయి. పుష్ప మూవీని చూస్తేనే ఇది అందరికీ అర్థమయి ఉంటుంది.
ఆహార్యం, భాషకు కూడా...
తాను నటించే మూవీలో వేషంతో పాటు ఆహార్యం, భాషకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా ఆకట్టుకునే బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడానికి రెడీ అవుతుంటారు. అల్లు అర్జున్ కు తెలుగు, తమిళం మాత్రమే కాదు కేరళలోనూ వీరాభిమానులున్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడంతో ఆయన ఇక ఎంపిక చేసుకునే సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తగ్గేదేలే అన్నట్లు గా ఇంకా మంచి మూవీ చేయలన్న ఉద్దేశ్యంతోనే ఆయన దర్శకుడిని కూడా ఎంపిక చేసుకుంటారు.
అట్లీ దర్శకత్వంలో...
తాజాగా అల్లు అర్జున్ సంచలన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో న్యూ లుక్ లో అల్లు అర్జున్ కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈమూవీని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కేరళలో ఒకేసారి ఈ మూవీని విడుదలచేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజా కబురు ఏంటంటే ఈ మూవీలో అల్లు అర్జున్ ను కొత్తగా చూపించడానికి దర్శకుడు అట్లీ ప్రయత్నిస్తున్నారు. ముంబయిలోని ఒక స్టూడియలో బన్నీ లుక్ పై ఫొటో షూట్ చేసినట్లు సమాచారం అందుతుంది. సైన్స్, ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో బన్నీ ఎలా కనిపిస్తారన్దది మరికొంద్ది రోజుల్లోనే అభిమానులకు రివీల్ చేయనున్నారు.
Next Story

