Fri Dec 05 2025 14:59:15 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : స్టయిల్ మార్చేస్తున్న బన్నీ.. లుక్ తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తాడా?
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన స్టయిల్ ను మార్చేస్తారు.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన స్టయిల్ ను మార్చేస్తారు. తొలి సినిమా గంగోత్రి నుంచి అల్లు అర్జున్ ను చూసిన వారికి ఆయన తన రూపంలో వచ్చిన మార్పులు చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోతారు. నిజంగా గంగోత్రి సినిమాలో ఇతను హీరోనా? అని ముక్కున వేలేసుకున్న వారంతా నేడు ఇతనే మా హీరో అని అనే దశకు వచ్చారంటే అందులో బన్నీ కృషిని ఎవరూ కాదనలేరు. నిరంతరం జిమ్ చేస్తూ ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ తన అందాలను మరింత పెంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అల్లు అర్జున్... ఎనీ డౌట్.
నిన్నటి వరకూ గుబురు గడ్డంతో...
అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గుబురు గడ్డంతో కనిపించే సరికి అదో వైవిధ్యమైన స్టోరీ కావడంతో దానికి ఒదిగిపోయాడు. ఐదేళ్ల పాటు గడ్డంతోనే ఉన్న అల్లు అర్జున్ ను చూసిన వారు అదే రూపం గుర్తుండిపోయింది. పుష్ప 1, పుష్ప 2 రెండూ సూపర్ డూపర్ హిట్ కావడంతో బన్నీ బాక్సాఫీసును బద్దలు కొట్టడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే అల్లు అర్జున్ తర్వాత మూవీకి మేకోవర్ అవుతున్నాడు. ముంబయిలో అల్లుఅర్జున్, అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ కోసం సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.
కొత్త మూవీలో...
అయితే అల్లు అర్జున్ కొత్త మూవీ ఇప్పటికే ముంబయిలో మొదలయిందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం తన పర్సనల్ ఫిజికల్ ట్రైనర్ గా ఎల్లాయిడ్ స్టీవెన్స్ ను నియమించుకుని ఫిజికల్ ట్రాన్స్ ఫామ్ అవుతున్నారని చెబుతున్నారు. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ ఏ లుక్ లో కనిపిస్తాడన్నది ఇంకా ఎటువంటి అప్ డేట్ రాకపోయినా గడ్డం తీసేసి స్లిమ్ గా తయారై మంచి లుక్ తో స్క్రీన్ పైకి వచ్చేందుకు బన్నీ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. మరి బన్నీ కొత్త లుక్ ఎలా ఉంటుందన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా బన్నీ విడుదల చేసిన ఫొటో కూడా ఆయన స్టయిలిష్ గా కనిపిస్తాడని తెలియచేస్తుంది.
Next Story

