Fri Dec 05 2025 22:45:00 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : ఆరో రోజుకు చేరుకున్న టాలీవుడ్ సమ్మె
టాలీవుడ్ లో సినీ కార్మికుల బంద్ ఆరోరోజుకు చేరుకుంది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని కోరుతూ ఫిలిం ఇండ్రస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెకు దిగింది

టాలీవుడ్ లో సినీ కార్మికుల బంద్ ఆరోరోజుకు చేరుకుంది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని కోరుతూ ఫిలిం ఇండ్రస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెకు దిగడంతో గత ఆరు రోజుల నుంచి షూటింగ్ లు నిలిచిపోయాయి. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ అన్నీ ఆగిపోయాయి. అయితే చర్చలు నిన్న జరగలేదు.
నేడు చర్చలు జరిగి...
ఈరోజు చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. నిర్మాతల మండలి కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్లకు అంగీకరించింది. అయితే వేతనాల విషయంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వేతనాలు పెంచితే చిన్న నిర్మాతలు చితికిపోతారని భావించి ఆ డిమాండ్ కు అంగీకరించకపోవడంతో నేడు జరిగే చర్చల్లో ఏ మేరకు చర్చలు ఫలిస్తాయన్నది చూడాలి. మరొకవైపు ఫిలింఛాంబర్ మాత్రం ఎలాంటి షూటింగ్ లు జరపవద్దని ఆదేశాలు జారీ చేయడంతో టాలీవుడ్ లో షూటింగ్ లు అన్నీ నిలిచిపోయాయి.
Next Story

