Sat Dec 06 2025 00:47:30 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : ఎనిమిదో రోజుకు చేరిన టాలీవుడ్ సమ్మె
టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది.

టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. సినీ కార్మికుల సంఘానికి, నిర్మాతల మండలికి మధ్య చర్చలు విఫలమవ్వడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్ లు బంద్ చేయాలని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు నిచ్చింది. నేటి నుంచి అన్ని సినిమా షూటింగ్ లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.
నేడు మంత్రి వద్దకు...
వేతనాలను 30 శాతం పెంచాలంటూ గత ఎనిమిది రోజులుగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు సంబంధించిన అందరూ కార్మికులు ఈ మ్మెలో పాల్గొనడటంతో సినిమా షూటింగ్ లు దాదాపుగా నిలిచిపోయాయి. మరొకవైపు నేటి నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటించింది. నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవనుంది.
Next Story

