దగ్గుబాటి అభిరాం మీద సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి..!

శ్రీరెడ్డి...
ఇప్పుడు ఈ పేరుకు పరిచయం అక్కరలేదు.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖుల పైన ఆరోపణలు చేస్తూ తెలుగు రాష్ట్రాలు మొత్తాన్నీ తన వైపుకి తిప్పుకొంది. తాజాగా డి.రామానాయుడు మనవడు, సురేష్ బాబు కుమారుడైన దగ్గుబాటి అభిరాం మీద సంచలన ఆరోపణలు చేయడం ద్వారా దేశం మొత్తం శ్రీ రెడ్డి వైపు చూస్తోంది.
అసలు ఈ శ్రీరెడ్డి ఎవరు అమె ఇలా ఎందుకు చేస్తోంది?
సాక్షి టీ.వీ. లో న్యూస్ రీడర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన శ్రీ రెడ్డి, అటు పిమ్మట సినిమాల పైన వ్యామోహం తో పరిశ్రమలో కి అడుగు పెట్టింది. కానీ ఎందరో వర్ధమాన తారల్లాగే శ్రీ రెడ్డి సినీ జీవితం కూడా సాఫీగా సాగలేదు. మొదట్లో చిన్న చిన్న అవకాశలు ఇచ్చిన ఇండస్ట్రీ త్వరలోనె మొండి చెయ్యి చూపించింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన శ్రీ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమ పైన యుద్ధం ప్రకటించింది. మొదట్లో చిన్న పబ్లిసిటీ స్టంట్ లానే అనుకున్న శ్రీ రెడ్డి ఆరోపణల పర్వం చినికి చినికి గాలీ వాన లాగా తయారయ్యింది.
తెలుగు సినీ పరిశ్రమని పీడలా పట్టుకొన్న కాష్టింగ్ కౌచ్ పై నా పోరాటం అని మొదలు పెట్టింది ... త్వరలో సుచిలీక్స్ తరహాలో శ్రీ లీక్స్ ఇస్తాను అంటూ సంచలనాలకు నాంది పలికింది .. తనతో సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేసింది. ఫోటోను పూర్తిగా కనిపించకుండా పెట్టడంతో శ్రీరెడ్డి కావాలనే పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది అన్నవాళ్ళు తాజాగా ఆ ఫోటొలోని వ్యక్తి దగ్గుబాటి అభిరాం అని తెలియడంతో తలలు పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో శ్రీ రెడ్డి తనతో వాట్సాప్ చాటింగ్లో అసభ్యంగా చాట్ చేసిన వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు తనతో చేసిన చాట్ల స్క్రీన్ షాట్లని కూడా బయట పెట్టింది. ఇలా బయట పెట్టిన వాళ్ళ లో యుట్యుబ్ హర్ష, ఇండియన్ ఐడల్ శ్రీరాం, ప్రొడ్యూసర్ రమేష్ పుప్పాల, డైరెక్టర్ కొరటాల శివ, రైటర్ కోన వెంకట్ మొదలైన వాళ్ళు వున్నారు. కొమ్ములు వచ్చిన శేఖరుడు అంటూ శేఖర్ కమ్ములను కూడా ఇందులోకి లాగింది.
తనకు న్యాయం జరగకపోతే మా అసోసియేషన్ ముందు బట్టలు విప్పుకొని నిరసన తెలియజేస్తానంటూ అన్నంత పనీ చేయడంతో విషయం సీరియస్ టర్న్ తీసుకొంది.
ఎంతో మంది జీవితాలను బాగు చేసేందుకు తాను తగల బడుతున్నాను అని, తాను బలైనా పదిమంది బాగుకోరే తానీ పని చేస్తున్నాను అని శ్రీరెడ్డి చెబుతోంది. తాను చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు కొందరు పెద్ద మనుషులు మీడియాను మేనేజ్ చేస్తున్నారు. కానీ నా పోరాటాన్ని ఎవ్వరూ ఆపలేరు.... అంటూ శ్రీరెడ్డి తేల్చి చెప్పింది. కొందరు పెద్ద మనుషులు ఆడుతున్న పొలిటికల్ గేమ్ వల్ల ఎందరో గొప్ప యాక్టర్లు చనిపోయారు. నా జీవితం గురించి నాకు భయం లేదు. మీ బెదిరింపులను నేను లెక్క చేయను. నేను మీకు చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ నా పోరాటం చిన్నది కాదు. ఈక కూడా పీకలేరు అని మొండిగా వెళుతోంది . తన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళతానని స్పష్టం చేస్తూ, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు స్పందించాల్సిన అవసరం వుందని తాజాగా తన ఫేస్ బుక్ పొష్ట్ లో తెలిపింది.
సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలమీదే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుండడంతో ఇప్పుడీ వ్యవహారం పరిశ్రమ తనంత తానుగా పరిష్కరించుకొనే దశ దాటిపోయిందనే అనిపిస్తోంది. ఇంకా చేయిదాటి పోక ముందే ప్రభుత్వం జోక్యం చేసుకొని శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలమీద దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

