Fri Dec 12 2025 22:01:12 GMT+0000 (Coordinated Universal Time)
హోటల్ లో కలిశాం గుర్తుందా..? టాప్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై చిన్నతరహా యుద్ధమే చేస్తూ పలువురు నటులు, దర్శకులపై ఆరోపణలకు దిగుతున్న నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ దర్శకుడిని టార్గెట్ చేశారు. తమిళ హిట్ దర్శకుడు ఆర్ఆర్ మురుగదాస్ తనకు సినిమాలో ఆఫర్ ఇస్తానని మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె పేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. ‘‘మురుగదాస్ గారూ...ఎలా ఉన్నారు. గ్రీన్ పార్క్ హోటల్ గుర్తాందా..? వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మనం కలిశాం. నాకు సినిమాలో పాత్ర ఇస్తానన్నారు. కానీ, ఇప్పటివరకు ఏ ఆఫర్ ఇవ్వలేదు. మీరు కూడా గొప్ప వ్యక్తి సర్’’ అంటూ పోస్ట్ చేశారు. జూన్ 9న ఆమె తనను మోసం చేసిన ఓ తమిళ డైరెక్టర్ గురించి త్వరలోనే బయటపెడతానని చెప్పిన నేపథ్యంలో ఈ పోస్ట్ చేసినట్లుగా కనపడుతోంది. అయితే, తమిళ సినిమాలో మహిళలను గౌరవిస్తారని ఆమె అప్పుడు పేర్కొనడం గమనార్హం.
Next Story

