Tue Mar 17 2026 19:44:48 GMT+0530 (India Standard Time)
ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేదించాడు

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై వరుసగా పలువురు దర్శకులు, నటులపై ఆరోపణలు గుప్పిస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ డైరెక్టర్ పై ఆరోపణలు చేశారు. తనను ఓ తమిళ డైరెక్టర్ లైంగికంగా వేదించాడని, ఆ దర్శకుడి వివరాలు త్వరలోనే బయటపెడతానని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, తమిళ సినీ పరిశ్రమ మహిళలను ఎంతగానో గౌరవిస్తుందని పేర్కొన్నారు. తనకు తమిళ సినిమాల్లో నటించాలని ఉందని వెల్లడించారు. ఇటీవల ఆమె బిగ్ బాస్ట్ హోస్ట్, హీరో నానిపై కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను బిగ్ బాస్ లో ఉండకపోవడానికి కారణం నానినే అని ఆమె ఆరోపించారు.
Next Story

