Fri Dec 05 2025 07:16:51 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : శ్రీకాంత్ అ అయ్యంగార్ పై కాంగ్రెస్ ఫిర్యాదు
మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు

మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల శ్రీకాంత్ అయ్యంగార్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన మహాత్మాగాంధీని కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా మద్యం తాగుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహాత్మాగాంధీని కించపరుస్తూ...
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కొద్ది సేపటి క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మాగాంధీని కించపర్చే విధంగా చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే తాము మా అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని, టాలీవుడ్ పెద్దలు శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలను ఖండించి చిత్రసీమ పరంగా ఆయనపై ఆంక్షలు విధించాలంటూ బల్మూరి వెంకట్ కోరారు.
Next Story

