Tue Dec 23 2025 09:33:26 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరెడ్డి మరో సంచలనం...‘రెడ్డి డైరీ’

టాలీవుడ్, కోలీవుడ్ లలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన నటి శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆమె గత నాలుగు నెలలుగా పలువురు నటులు, డైరెక్టర్లపై లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె స్వీయ చరిత్రను సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించింది. తమిళంలో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు... సినిమా పేరు ‘రెడ్డి డైరీ’గా పెట్టినట్లు ఆమె చెన్నైలో వెల్లడించింది. ఈ చిత్రానికి అల్లావుద్దీన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. తనపై లైంగిక వేదింపులకు సంబంధించిన అన్ని వీడియో ఆధారాలు ఈ సినిమా ద్వారా బయటపెట్టనున్నట్లు స్పష్టం చేసింది.
Next Story

