ముత్తయ్య మురళీధరన్ పాత్రలో స్టార్ హీరో
శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మీద ఓ సినిమా రాబోతుందని కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అది కూడా కోలీవుడ్ లో ఈసినిమా ను [more]
శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మీద ఓ సినిమా రాబోతుందని కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అది కూడా కోలీవుడ్ లో ఈసినిమా ను [more]
శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మీద ఓ సినిమా రాబోతుందని కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అది కూడా కోలీవుడ్ లో ఈసినిమా ను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మురళీధరన్ పాత్ర లో సెన్సషనల్ హీరో విజయ్ సేతుపతి నటించడం విశేషం. ఎటువంటి పాత్ర అయినా అవలీలగా చేసే విజయ్ తొలిసారి క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే విజయ్ క్రికెటర్ మురళీధరన్ లాగా అతడికి ఎలా మేకోవర్ చేస్తారన్నది ఆసక్తికరం. మురళీధరన్ మీద సినిమా తీయడానికి చాలానే స్టఫ్ ఉంది.
విమర్శలు.. అవార్డులు…..
ఇతని జీవితంలో ఎన్నో అవార్డులు , విమర్శలు. ముఖ్యంగా తన బౌలింగ్ పై చాలా విమర్శలు వచ్చాయి. అతడిది బౌలింగ్ కాదని త్రో అంటూ పలుమార్లు ఫిర్యాదులు రావడం.. అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి రావడం జరిగింది ఎన్నో వివాదాల్ని, అడ్డంకుల్ని అధిగమించి ఏకంగా 800 వికెట్లతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్ టేకర్‌గా నిలవడంవి విశేషం. మరి ఇటువంటి పాత్ర లో విజయ్ కనిపిస్తే వేరే రేంజ్ లో ఉంటది మూవీ. మురళి కి తమిళ బాషా వచ్చు. అతను పెళ్లాడిన అమ్మాయి తమిళ అమ్మాయే. విజయ్ సేతుపతి తన పాత్రలో నటించడం తనకు దక్కిన గౌరవం అని మురళీ పేర్కొన్నాడు. ఈ మూవీ ని ఎవరు డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తారో తెలియాల్సిఉంది. త్వరలోనే దీని పై అధికార ప్రకటన రానుంది.