జెర్సీ భామకి షాక్
నాని సరసన జెర్సీ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా శ్రీనాధ్.. ఆ సినిమాలో ఎమోషనల్ నటనతో సారా గా అదిరిపోయే ట్రెడిషనల్ పాత్రలో [more]
నాని సరసన జెర్సీ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా శ్రీనాధ్.. ఆ సినిమాలో ఎమోషనల్ నటనతో సారా గా అదిరిపోయే ట్రెడిషనల్ పాత్రలో [more]

నాని సరసన జెర్సీ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా శ్రీనాధ్.. ఆ సినిమాలో ఎమోషనల్ నటనతో సారా గా అదిరిపోయే ట్రెడిషనల్ పాత్రలో ఆకట్టుకుంది. జెర్సీ సినిమాలో నాని కి సరిసమానమైన మార్కులు శ్రద్దా శ్రీనాధ్ కొట్టేసింది. నాని తో రొమాన్స్ కానివ్వండి, సంసారం విషయంలో కానివ్వండి, బాధ్యతలు మోసే భార్యగా .. ఆమె పడే మోనోవేదన కానివ్వండి, నాని కి తల్లిగా కానివ్వండి… అన్ని విషయాల్లో నటనలో మంచి వేరియేషన్స్ చూపించింది. ఇక జెర్సీ సినిమా తరవాత అది సాయి కుమార్ తో జోడి సినిమాలో నటించింది.
ఇక్కడ అవకాశాలు లేవే….
జోడి సినిమా గత శుక్రవారం విడుదలవడం ప్లాప్ కొట్టడం జరిగింది. ఆ సినిమా ప్లాప్ అయినా శ్రద్దా శ్రీనాద్ కి అస్సలు పేరు రాలేదు. ఆమె కాంచనమాల పాత్రను దర్శకుడుగా అంత వీక్ గా డిజైన్ చెయ్యడంతో ఆమె పాత్ర సినిమాలో తేలిపోయింది. సినిమాలో చాలా అందంగా కనిపించిప్పటికీ… నటనకు ప్రాధాన్యం లేకుండా పోయిన పాత్రతో శ్రద్దా శ్రీనాధ్ కి నెగిటివ్ మార్కులు పడ్డాయి. ఆమె పాత్రని దర్శకుడు కొద్దిగా మనసు పెట్టి రాసుంటే.. ఆమె పాత్ర హైలెట్ అయ్యేది. ఇక జోడి సినిమా తర్వాత శ్రద్దా శ్రీనాధ్ కి తెలుగులో మరో సినిమాలేదు. కానీ తమిళనాట మాత్రం రెండు సినిమాలతో బిజీగా వుంది. గ్లామర్‌గా కాకపోయినా నటన పరంగా శ్రద్దా మంచి టాలెంట్ ఉన్న నటి. మరి జోడి సినిమా చూశాక మన యంగ్ హీరోలెవరూ ఆమెకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు.

