Sat Mar 07 2026 03:41:35 GMT+0530 (India Standard Time)
కోమాలో విజయ్ ఆంటోనీ.. ఆందోళనలో అభిమానులు
ఆయన కోమాలోకి వెళ్లారన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మూడ్రోజుల క్రితం మలేషియాలో బిచ్చగాడు షూటింగ్ చేస్తున్న

తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్ లో బిచ్చగాడు 2 షూటింగ్ లో ఉండగా.. ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన కోలుకుంటున్నారని చెప్పింది చిత్రబృందం. తాజాగా.. ఆయన కోమాలోకి వెళ్లారన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మూడ్రోజుల క్రితం మలేషియాలో బిచ్చగాడు2 షూటింగ్ చేస్తున్న సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యాడు. బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో విజయ్ ఉన్న బోటు ఎదురుగా బోటును ఢీ కొట్టింది. అప్పుడు విజయ్ ఆంటోని పైకి ఎగిరి కింద పడటంతో గాయాలయ్యాయి. ఆయన ముఖం, దవడకు గాయాలయ్యాయని, పళ్లు కూడా విరిగాయంటూ ఆయన సతీమణి ఫాతిమా తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
బుధవారం సాయంత్రమే విజయ్ ఆంటోనీని మలేషియా నుండి చెన్నైకి తీసుకురాగా.. విజయ్ ఆంటోనీ ఆరోగ్యం బాగానే ఉందని కొందరంటున్నారు. కానీ.. ఇంకొందరు మాత్రం ఆయన కోమాలోకి వెళ్లారంటున్నారు. అయితే.. విజయ్ ఆంటోనీ బాగానే ఉన్నాడని, ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.
Next Story

