Tue Mar 17 2026 08:21:18 GMT+0530 (India Standard Time)
సోనాలికి ప్రాణాంతక వ్యాధి

హీరోయిన్ సోనాలి బ్రిందే సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను హైగ్రేడ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నానని ఆమె చేదు వార్తను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తాను క్యాన్సర్ వ్యాధితో యుద్ధానికి సిద్ధమవుతున్నాని, ఈ యుద్ధంలో తనకు కుటుంబం, స్నేహితులే బలమని ఆమె పేర్కొన్నారు. తన డాక్టర్ల సూచనల మేరకు తాను న్యూయార్క్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మహేష్ బాబుతో మురారి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సొనాలీ అనేక హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఓ హిందీ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
Next Story

