Thu Mar 19 2026 05:52:25 GMT+0530 (India Standard Time)
ఫ్యాన్స్ కు పండగే.. ఆ రెండు సినిమాల కన్నా ముందే భీమ్లా నాయక్ !
కరోనా కారణంగా ఏర్పడిన క్లిష్టపరిస్థితులు తొలగిపోతే ఫిబ్రవరి 25నే భీమ్లా నాయక్ విడుదలవుతుంది. అప్పటికీ పరిస్థితులు

సినీ అభిమానులకు ఇక పండగే. ఒకే రోజు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్లను ప్రకటించాయి. సినీ నిర్మాతలందరితో చర్చించిన అనంతరం.. ఈసారి పక్కా రిలీజ్ ఫిక్స్ అంటే ఆర్ఆర్ఆర్ బృందం విడుదల తేదీని ప్రకటించింది. ఆ వెంటనే ఆచార్య మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆర్ఆర్ఆర్.. మార్చి 25వ తేదీన ప్రపంప వ్యాప్తంగా విడుదల కానుండగా.. ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. తాజాగా భీమ్లా నాయక్ చిత్ర బృందం కూడా విడుదల తేదీని ప్రకటించింది.
కరోనా కారణంగా ఏర్పడిన క్లిష్టపరిస్థితులు తొలగిపోతే ఫిబ్రవరి 25నే భీమ్లా నాయక్ విడుదలవుతుంది. అప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీన సినిమాను విడుదల చేస్తామని సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదలైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఏప్రిల్ 1న విడుదలైతే మాత్రం ఆర్ఆర్ఆర్ - భీమ్లా నాయక్ ల కలెక్షన్లు చీలిపోయి అవకాశం ఉంది. ఈ విషయం గ్రహించి భీమ్లా నాయక్ యూనిట్ మరోసారి విడుదల తేదీని వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. కాగా.. ఇప్పటికే భీమ్లా నాయక్ నుంచి పలు పాటలు, గ్లింప్స్ విడుదల కాగా.. అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి నటిస్తున్నారు.
News Summary - Sithara Entertainments Announced Bheemla Nayak Release Date
Next Story

