Sun Oct 06 2024 00:06:54 GMT+0000 (Coordinated Universal Time)
విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం
గత నెల ఆమె అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే చికిత్స
నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ప్రముఖ వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత నెల ఆమె అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది లతా మంగేష్కర్ కు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్ ప్రతీత్ సాంధానీ తెలిపారు. వారం క్రితమే ఆమెకు వెంటిలేటర్ తొలగించి చికిత్స ఇవ్వగా.. ఆరోగ్యం విషమించడంతో మళ్లీ వెంటిలేటర్ పైనే చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read : అసెంబ్లీ ముందు రోడ్డు ప్రమాదం.. ఉద్యోగి మృతి
92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి మొదటివారంలో కోవిడ్ తో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత దాని నుంచి కోలుకున్నప్పటికీ.. న్యూమోనియాకు గురికావడంతో అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. వారం క్రితమే ఎటువంటి సమస్య లేదని ఆరోగ్య పరిస్థితి మెరుగైందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం కుదుటపడి రికవరీ అవుతున్నారనుకున్న తరుణంలో మరోసారి విషమంగా మారింది. త్వరలో పూర్తి రికవరీతో బయటకు రావాలని అభిమానులు ప్రార్థిస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
Next Story