హరీష్ కోసం కాదు.. వకీల్ కోసమే?
పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ మూడోసారి ముచ్చటగా నటించబోతుంది అంటూ సోషల్ ఇండియాలో తెగ ప్రచారం జరుగుతుంది. శృతి హాసన్ ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లో [more]
పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ మూడోసారి ముచ్చటగా నటించబోతుంది అంటూ సోషల్ ఇండియాలో తెగ ప్రచారం జరుగుతుంది. శృతి హాసన్ ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లో [more]
పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ మూడోసారి ముచ్చటగా నటించబోతుంది అంటూ సోషల్ ఇండియాలో తెగ ప్రచారం జరుగుతుంది. శృతి హాసన్ ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ.. పవన్ పక్కన శృతి అయితే పర్ఫెక్ట్ జోడి అందుకే.. మూడుసారి శృతి తో పవన్ పక్కా అంటూ వార్తలొస్తున్నాయి. అయితే గబ్బర్ సింగ్ తో ఈ జంట బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ.. కాటమరాయుడు తో భారీ డిజాస్టర్ కొట్టారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమా కోసం దర్శకుడు హరీష్ శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నాడనే టాక్ మొదలయ్యింది.
కానీ తాజాగా హరీష్ శంకర్ సినిమా కోసం కాదు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫిలిం వకీల్ సాబ్ కోసమే శృతి హాసన్ రాబోతుంది అంటున్నారు. వకీల్ సాబ్ లో అంజలి, నివేత థామస్, అనన్య నాగల్ల హీరోయిన్స్ గా నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ వైఫ్ అంటే ఓ గెస్ట్ పాత్ర కోసం శృతి హాసన్ ని దర్శకుడు వేణు శ్రీరామ్ నిర్మాత దిల్ రాజు సంప్రదించారనే టాక్ కోలీవుడ్ నుండి టాలీవుడ్ సర్కిల్స్ లోను మోగిపోతుంది. అయితే దర్శకుడు పవన్ కోసం గెస్ట్ రోల్ ఆఫర్ చెయ్యగానే శృతి హాసన్ పవన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. తమిళ పింక్ రీమేక్ లో అజిత్ కోసం బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఆ క్యామియో రోల్ లో నటించింది. మరి తెలుగు వకీల్ సాబ్ కోసం శృతి రాబోతుందంటున్నారు.. కథ రీత్యా ఈ పాత్రకు కొంచెం స్క్రీన్ స్పేస్ మాత్రమే ఉంటుంది.. అయితే శృతి హాసన్ ఒప్పేసుకుందట.