Fri Dec 05 2025 17:34:10 GMT+0000 (Coordinated Universal Time)
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సాంగ్ షూట్ .. హైదరాబాద్ లోనే
హైదరాబాద్‌లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో పాట చిత్రీకరణ ప్రారంభం అయింది. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది

హైదరాబాద్‌లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో పాట చిత్రీకరణ ప్రారంభం అయింది. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలోని పాట చిత్రీకరణ నిన్న ప్రారంభమయింది. హైదరాబాద్ లో ఒక సెట్ లో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో పాటలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ మూవీలో సాంగ్స్ కూడా అదిరిపోతాయంటున్నారు.
టీజర్ తోనే...
తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, చిరంజీవి,యనతారపై ప్రత్యేకంగా షూటింగ్ చేస్తున్న ఈ పాట విజయ్ పొలంకి కొరియోగ్రఫీలో ఉంటుందని తెలిసింది. భీమ్స్ అందించిన ట్యూన్ ఆకట్టుకునేలా, ఎనర్జిటిక్‌గా ఉండనున్నాయని అంటున్నారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ను ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో చిరంజీవి ఒక వాహనంలో స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తూ, ఆయుధాలతో ఉన్న కమాండోలు వెంబడించే సన్నివేశాలు చూపించగా, నేపథ్య సంగీతంలో “బాస్” పదాన్ని పదేపదే వినిపించడంతో, ఆయన సెక్యూరిటీకి సంబంధించిన శక్తివంతమైన సంస్థ అధిపతిగా కనిపించేలా టీజర్ రూపొందింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్ కు అయితే పూనకాలు తెప్పించింది.
ఖచ్చితంగా హిట్ అంటూ...
మన శంకర్ వరప్రసాద్ గారూఈ చిత్రం షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మితత కొణిదెల నిర్మిస్తున్నారు. ‘సైరా’, ‘గాడ్‌ఫాదర్’ తర్వాత చిరంజీవి – నయనతార కలసి తెరపై కనిపించడం ఈ చిత్రానికి మరింత ఆకర్షణ కలిగిస్తోంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే బ్లాక్‌బస్టర్‌ని అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, సమీర రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కథను ఎస్.కృష్ణ, జి.ఆది నారాయణ కలిసి రాశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్.కృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో అంచనాలు మామూలుగా లేవు. ఖచ్చితంగా హిట్ కొట్టి తీరతామని సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు.
Next Story

