నాగ్ నే తప్పుబడుతుందే?
నాగార్జున తెలుగు బిగ్ బాస్ ని రెండు సీజన్స్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇంతవరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ లుకూడా నాగ్ ని [more]
నాగార్జున తెలుగు బిగ్ బాస్ ని రెండు సీజన్స్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇంతవరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ లుకూడా నాగ్ ని [more]
నాగార్జున తెలుగు బిగ్ బాస్ ని రెండు సీజన్స్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇంతవరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ లుకూడా నాగ్ ని కానీ ఏ ఇతర హోస్ట్ ని కానీ తప్పు బట్టిన సందర్భాలు లేవు. ఎందుకంటే హౌస్ బయటికొచ్చాక బిగ్ బాస్ మమ్మల్ని బాగా చూపించలేదంటూ బిగ్ బాస్ నే తిడుతున్నారు కానీ నాగ్ ని ఎక్కడా బ్లేమ్ చేసిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ నాగార్జున ని తప్పుబడుతుంది. గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ ఒకే ఒక్క వారానికే అమ్మ రాజశేఖర్ నామినేట్ చేసి నామినేషన్స్ లోకి పంపగా.. అదే వారం స్వాతి ఆట బావుండని కారణముగా ప్రేక్షకులు స్వాతి దీక్షిత్ ని బయటికి పంపేశారు. దానితో చాలామంది ప్రేక్షకులు అలాగే స్వాతి దీక్షిత్ కూడా షాకయ్యింది. ఒక్కవారానికే బయటికి పంపిస్తారా… అంటూ సందు దొరికిన చోట బిగ్ బాస్ హౌస్ లోని వాళ్లపై విరుచుకుపడింది.
ఇక తాజాగా నాగార్జుననే తప్పుడబడుతుంది స్వాతి. ఎందుకంటే స్వాతి దీక్షిత్ ఎలిమినేటి అయ్యాక, స్వాతి ని బయటికి పంపేసాక ఆదివారం లాస్య, సోహైల్, అభిజిత్, కుమర్ సాయి, మెహబూబ్, హారిక లాంటి వాళ్ళని నామినేషన్స్ కి వస్తే గేమ్ బాగా ఆడకపోతే స్వాతి లాగ ఎలిమినేషన్స్ కి వెళాల్సి ఉంటుంది అంటూ నాగ్ గట్టిగా మందలించాడు. ఆట ఆడనందుకే స్వాతి దీక్షిత్ బయటికి వెళ్ళిపోయింది అంటూ హెచ్చరించాడు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూసిన స్వాతి దీక్షిత్ నాగార్జున గారు ఆలా అనడం బాలేదు. నాకు బాధ అనిపించింది. నేను హౌస్ లో చేసిన డాన్స్, గేమ్, నవరసాల టాస్క్ లో నా పెరఫార్మెన్సు చాలా బావుంది. కానీ బిగ్ బాస్ నన్ను ఎక్కువగా ఫోకస్ చెయ్యకుండా బయటికి పంపేసింది. వెలికి దెబ్బతగిలా నేను గేమ్ ఆడాను, అలాంటిది నేను గేమ్ ఆడలేదని నాగార్జున గారు చెప్పడం బాధనిపించింది అంటూ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో తన అక్కసు వెళ్లగక్కింది.