Wed Mar 18 2026 09:52:47 GMT+0530 (India Standard Time)
‘డ్రైవర్ రాముడు’గా వస్తోన్న షకలక శంకర్

కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా దూసుకుపోతున్నాడు మన నవ్వుల వీరుడు షకలక శంకర్. తాను హీరో గా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా షకలక శంకర్ డ్రైవర్ రాముడు సినిమాని శరవేగం గా పూర్తిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.
త్వరలోనే విడుదల చేస్తాం
ఇప్పటికే విడుదల అయినా పోస్టర్, మొదటి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. షకలక శంకర్ హీరోగా నటించిన రెండో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... డ్రైవర్ రాముడు చిత్రీకరణ దాదాపు పూర్తియింది. షకలక శంకర్ సినిమా అవుట్ ఫుట్ చూసి చాల హ్యాపీ గా ఉన్నారు. మా నిర్మాతలు కె. వేణు గోపాల్, ఎమ్ ఎల్ రాజు, టీ.కీరత్ బాగా ఖర్చు పెడుతున్నారు. సినిమా చాల బాగావస్తుంది. త్వరలోనే విడుదల చేస్తాం.
Next Story

