Sat Dec 07 2024 23:48:57 GMT+0000 (Coordinated Universal Time)
జవాన్ ట్రైలర్లో షారుఖ్ డైలాగ్.. ఆ అధికారికేనా..?
జవాన్ మూవీలో షారుఖ్ చెప్పిన డైలాగ్ ఆ మాజీ ప్రభుత్వ అధికారికే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి ఆ డైలాగ్..?
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా నటిస్తున్న సినిమా ‘జవాన్’ (Jawan). తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార (Nayanathara) హీరోయిన్ గా నటిస్తుండగా దీపికా పదుకొనె అతిథి పాత్రలో కనిపించబోతుంది. ఇక ప్రియమణి, యోగిబాబు, సన్యా, రిద్ధి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఇక ఈ ట్రైలర్ లో షారుఖ్ చెప్పిన ఒక డైలాగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. "నా కొడుకు మీద చెయ్యి వేసే ముందు.. వాడి బాబు మీద చెయ్యి వెయ్యి” అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. షారుఖ్ చెప్పిన ఈ డైలాగ్ ఆ మాజీ ప్రభుత్వ అధికారికే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) గతంలో డ్రగ్స్ కేసులో చిక్కుకొని జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే.
యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేశాడు. ఆర్యన్ ని సమీర్ వాంఖడేనే కావాలని ఇరికించాడని వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీలోని ఈ డైలాగ్ ని చుసిన నెటిజెన్స్.. షారుఖ్, సమీర్ వాంఖడేకి ఇన్డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ కి సంబందించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతుంది.
జవాన్ మూవీ విషయానికి వస్తే.. షారుఖ్ ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. ఇక ట్రైలర్ గురించి మాట్లాడితే.. గ్రాండ్ విజువల్స్, యాక్షన్ పార్ట్ తో బాగానే ఉంది. కానీ ట్రైలర్ లోని కథ చూస్తుంటే.. ఓల్స్ స్టోరీకి న్యూ స్క్రీన్ ప్లే రాసుకొని వస్తున్నట్లు కనిపిస్తుంది. మరి తన స్టైలిష్ మేకింగ్ తో డైరెక్టర్ అట్లీ ఆడియన్స్ ని మెప్పిస్తాడా..? లేదా..? అనేది వేచి చూడాలి. సెప్టెంబర్ 7న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
Next Story