Thu Dec 05 2024 16:29:55 GMT+0000 (Coordinated Universal Time)
శాకుంతలం ఫస్ట్ లుక్.. దేవకన్యగా సమంత
గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా నుంచి నేడు సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ లో సమంత
విభిన్న కథలను ఎంచుకుంటూ.. తన నటన, అభినయంతో ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటోన్న టాలీవుడ్ హీరోయిన్లలో సమంత ఒకరు. సౌత్ లో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న అగ్రనటీమణుల్లో సమంత కూడా ఉంది. పాత్ర పరిధిని బట్టి పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది ఈ కేరళ కుట్టి. ఇటీవలే సమంత నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా నుంచి నేడు సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ సమంత అచ్చం దేవకన్యలా కనిపిస్తోంది. వన్య ప్రాణులు చుట్టూ చేరి ఆ అందాన్ని కనులతో స్పర్శిస్తున్నట్లు పోస్టర్ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కీలక పాత్రలో నటించింది. దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాగా శాకుంతలం తెరకెక్కుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటంతో.. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
News Summary - Shaakuntalam First Look: Samantha Ruth Prabhu Is Enchanting As Shakuntala
Next Story