Thu Mar 19 2026 09:27:22 GMT+0530 (India Standard Time)
సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం
ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం

ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులుండగా.. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టివి రంగాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రెండో కొడుకు వెంకట్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. కాగా.. కమలమ్మ అంత్యక్రియలు గురువారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మహర్షి రాఘవ తల్లి మృతి పట్ల పలువురు సంతానం తెలియజేస్తున్నారు.
రాఘవ.. సీనియర్ డైరెక్టర్ వంశీ తీసిన మహర్షి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మహర్షి రాఘవ గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకూ 150కు పైగా సినిమాల్లో నటించారు. `జంబలకిడిపంబ`, `చిత్రం భళారే విచిత్రం`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం` వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Next Story

