ఆ డైరెక్టర్ మీద ఫైర్ అయిన రాశి
శుభాకాంక్షలు, గోకులంలో సీత, మా ఆవిడా మీదొట్టు మీ ఆవిడ చాలామంచిది లాంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశి.. చాలా త్వరగా ఫెడవుట్ లిస్ట్ [more]
శుభాకాంక్షలు, గోకులంలో సీత, మా ఆవిడా మీదొట్టు మీ ఆవిడ చాలామంచిది లాంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశి.. చాలా త్వరగా ఫెడవుట్ లిస్ట్ [more]

శుభాకాంక్షలు, గోకులంలో సీత, మా ఆవిడా మీదొట్టు మీ ఆవిడ చాలామంచిది లాంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశి.. చాలా త్వరగా ఫెడవుట్ లిస్ట్ లోకి చేరిపోయిన హీరోయిన్. అయితే తర్వాత ఐటెం సాంగ్స్ తోనూ, నెగెటివ్ కేరెక్టర్స్ తోనూ ఆకట్టుకున్నప్పటికీ..ఆమె సినిమా కెరీర్ మాత్రం నిలకడగా సాగలేదు. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రాశి కి అలీ అలీతో జాలిగా ప్రోగ్రాం ద్వారా అనేక ప్రశ్నలు వెయ్యగా వాటికి రాశి ఆసక్తికర సమాధానాలు చెప్పింది. అలీ మీకు నచ్చని దర్శకుడు ఎవరు అనగానే దానికి రాశి వెంటనే తడుముకోకుండా దర్శకుడు తేజ అని చెప్పింది. మీకు సినిమా లో మంచి పాత్ర అని చెప్పి.. ఎవరైనా ఫ్రాడ్ చేసారా అని అడగగా… దానికి రాశి ఇంకెవరు తేజనే అని చెప్పింది.
నిజం సినిమాలో మహేష్ బాబు హీరో అని.. గోపీచంద్ మీది లవ్ ట్రాక్ అని మీ లవ్ ట్రాక్ లోకి విలన్ వస్తాడని చెప్పి.. తన కట్టు బొట్టు అన్ని మార్పించిన తేజ.. షూటింగ్ సమయంలో తన కేరెక్టర్ ని నెగెటివ్ చేసేశాడని, విలన్ గా తన కేరెక్టర్ కనిపించండం తో వెంటనే సెట్స్ నుండి వెళ్లిపోవాలనుకుంటే… రాశి అన్నయ్య మాత్రం హీరోయిన్స్ ఇలా చెయ్యకూడదని, ఇప్పటివరకు నీకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.. ఇప్పుడు ఇలా చెయ్యడం బాగోదని చెప్పడంతో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసానని.. తేజ కథ ఒకలా చెప్పి సినిమా మరోలా తీసాడని తేజ మీద ఫైర్ అవుతుంది రాశి.
- Tags
- రాశి

