66 ఏళ్ల వయసులో ఫుల్ బిజీ అయిపోయింది
ఒకప్పుడు హీరోయిన్స్‌గా చలామణి అయిన చాలామంది కథానాయికలు ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే రెండో ఇన్నింగ్స్ లో వారు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అక్క, [more]
ఒకప్పుడు హీరోయిన్స్‌గా చలామణి అయిన చాలామంది కథానాయికలు ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే రెండో ఇన్నింగ్స్ లో వారు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అక్క, [more]

ఒకప్పుడు హీరోయిన్స్‌గా చలామణి అయిన చాలామంది కథానాయికలు ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే రెండో ఇన్నింగ్స్ లో వారు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అక్క, అమ్మ, పిన్ని, వదిన లాంటి సపోర్టింగ్ రోల్స్ లో నెట్టుకొస్తున్నారు. అదికూడా కొంత వయసు వరకు చేస్తారు కానీ 60 ఏళ్ళ తరువాత సినిమా లకు పూర్తిగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
కానీ నటి లక్ష్మి అలా కాదు. 66 ఏళ్ల వయసులో థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. త్వరలో వచ్చే పెద్ద సినిమాల్లో ఆమె కనిపించనున్నారు. ఒకప్పుడు కథానాయకిగా అలరించిన ఆమె ఆ తరవాత అమ్మ లాంటి చాలా సపోర్టింగ్ రోల్స్ చాలా చేశారు. ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి తల్లి పాత్రలు చేసారు. మల్లి కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఫుల్ బిజీగా అయిపోయారు.
లేటెస్ట్ గా ఈమె ఓ బేబీ చిత్రం లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రిలీజ్ కానున్న నాగార్జున యొక్క ‘మన్మథుడు 2’లో ఆయనకు తల్లిగా నటించారు. అలానే నాని నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఆమె బామ్మగా ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారు. అలా ఫుల్ బిజీగా ఉన్నారు లక్ష్మి. ఈ వయసులో కూడా ఆమెకు ఇన్ని ఆఫర్స్ రావడం అంటే మాములు విషయం కాదు.

