Sat Jan 31 2026 18:18:40 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా నటుడు వినోద్ హఠాన్మరణం

టాలీవుడ్ లో ఈ మధ్యన హఠాన్మరణాలు ఎక్కువయ్యాయి. మొన్నటికి మొన్న ఆహుతి ప్రసాద్ అలానే అనారోగ్యంతో కన్ను మూసారు. ఇప్పుడు మరో నటుడు ఇలానే అనారోగ్యంతో మరణించాడు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్ వంటి సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు వినోద్ అలియాస్ అరిశెట్టి నాగేశ్వరరావు ఈ తెల్లవారి జామున 2 గంటల ప్రాంతంలో బ్రెయిన్ స్ట్రోక్తో మరణించారు. హైదరాబాద్ లోని తన స్వగృహంలో వినోద్ కన్ను మూసారు. కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెర సీరియళ్ల లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వినోద్ హఠాన్మరణం టాలీవుడ్ ని కుదిపేసింది. ఆయన మృతికి టాలీవుడ్ లోని బుల్లితెర, వెండితెర ప్రముఖులు సంతాపం తెలియజేసారు
Next Story
