Wed Jul 09 2025 19:25:20 GMT+0000 (Coordinated Universal Time)
చిత్రపరిశ్రమను వీడని మహమ్మారి.. స్టార్ హీరోకు రెండోసారి పాజిటివ్ !
ఈ మధ్యే కరోనా బారిన పడి.. మళ్లీ వెంటనే పాజిటివ్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కోలీవుడ్ సీనియర్ హీరో అయిన

కరోనా.. ఇది మన దేశంలోకి అడుగుపెట్టి రెండేళ్లయింది. రెండేళ్లుగా ఈ మహమ్మారి వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు. లాక్ డౌన్లు, ఆంక్షలు, కర్ఫ్యూలు ఇలా ఎన్ని అమలు చేసినా.. మహమ్మారి మాత్రం అదనుచూసుకుని రెచ్చిపోతూనే ఉంది. అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా ఈ మహమ్మారి వల్ల కుదేలయింది. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా బారిన పడిన నటీనటులందరికీ మళ్లీ వైరస్ సోకుతోంది. కానీ.. ఈ మధ్యే కరోనా బారిన పడి.. మళ్లీ వెంటనే పాజిటివ్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది.
Also Read : ఢిల్లీ ఎయిర్ పోర్టులో తుపాకీ కలకలం
కోలీవుడ్ సీనియర్ హీరో అయిన శరత్ కుమార్, ఆయన భార్య రాధిక, కూతురు వరలక్ష్మిలు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి నుంచి కోలుకున్న కొద్దిరోజులకే మళ్లీ పాజిటివ్ రావడం గమనార్హం. తనకు మరోసారి కరోనా సోకిందని శరత్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. "ప్రియమైన స్నేహితులు, నా దగ్గరి బంధువులు రాజకీయ పార్టీలోని నా సోదర సోదరీమణులకు తెలియజేస్తున్నాను. ఈ సాయంత్రం నేను పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. నాతో గత వారం రోజులుగా పరిచయం ఉన్న ప్రియమైన వారందరూ వెంటనే కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు.
Next Story