Wed May 21 2025 01:05:55 GMT+0000 (Coordinated Universal Time)
kubera : కుబేర వచ్చే ముందే కలెక్షన్లు మూట కట్టుకుని వస్తుందా?
శేఖర్ కమ్ముల తమిళ్ హీరో ధనుష్ తో ఒక మూవీ తీస్తున్నారు. దీనికి కుబేరగా పేరుపెట్టారు

శేఖర్ కమ్ముల మూవీ అంటే చాలు ఖచ్చితంగా హిట్ అంతే.. హ్యాపీ డేస్ నుంచి ఆనంద్, గోదావరి తర్వాత తీసిన ఫిదా వరకూ అన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలే. ఆయన నుంచి మూవీ వస్తుందంటే చాలు అందరూ ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. శేఖర్ కమ్ములకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఆశ్చర్యంలేదు. ఆయన కథ.. కథనంలోనూ, దర్శకత్వంలోనూ, పాటల్లోనూ తీసుకునే జాగ్రత్తలు అలా ఉంటాయి మరి. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయి ముందుగానే సినిమా రేంజ్ ఏంటో ప్రేక్షకులకు చెప్పేస్తుంది.
పాటలన్నీ హిట్...
గోదావరి.. ఫిదా ఇలా ఒకటేమిటి శేఖర్ కమ్ముల తీసిన అన్ని మూవీలలో పాటలన్నీ ముందుగానే వీనుల విందుగా ప్రేక్షకులకు అందడంతో ఇక థియేటర్లకు క్యూ కడతారు. అలాంటి శేఖర్ కమ్ముల తమిళ్ హీరో ధనుష్ తో ఒక మూవీ తీస్తున్నారు. దీనికి కుబేరగా పేరుపెట్టారు. ఈ మూవీలో ధనుష్ తో పాటు అక్కినేని నాగార్జున కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ముంబయి బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నట్లు ముందుగానే లీకులు అందాయి.
పోయిరా మావా అంటూ...
ఈ మూవీలో ధనుష్ బిక్షగాడి పాత్ర పోషిస్తున్నాడట. నాగార్జున మాత్రం బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తాడట. దీంతో ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ ఈ మూవీ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాత సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈమూవీకి సంబంధించి తాజాగా పోయిరా మావా అంటూ పాటను విడుదల చేశారు.మాస్ డ్యాన్స్ తో ధనుష్ అదరగొట్టాడు. ఈ మూవీ జూన్ 20వ తేదీన విడుదల కానుండటంతో థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోతాయి. బాక్సాఫీసు ఖచ్చితంగా బద్దలవ్వాల్సిందేనన్నది క్రిటిక్స్ అంచనా.
Next Story