Tue May 20 2025 04:20:55 GMT+0000 (Coordinated Universal Time)
Venkatesh : నవ్వులతోనే హిట్ కొట్టేస్తున్న విక్టరీ వెంకటేశ్... ఈసారి మూవీ మాటల మాంత్రికుడితోనేనట
విక్టరీ వెంకటేశ్ మూవీ అనగానే ఒకవర్గం ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా మహిళ ప్రేక్షకులు వెంకటేశ్ మూవీ కోసం చూస్తుంటారు.

విక్టరీ వెంకటేశ్ మూవీ అనగానే ఒకవర్గం ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా మహిళ ప్రేక్షకులు వెంకటేశ్ మూవీ కోసం చూస్తుంటారు. వెంకటేశ్ గత కొంత కాలం నుంచి ఫైట్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ సినిమాలో ఎక్కువగా కామెడీకే చోటు ఉండే కథనాలు ఎంచుకుంటున్నారు. ఈ తరం ప్రేక్షకులకు అదే బాగా నచ్చుతుంది. వెంకటేశ్ నటించిన అనేక చిత్రాలు కామెడీ మూలంగానే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మల్లీశ్వరి నుంచి నమో వెంకటేశ.. ఎఫ్ 1, ఎఫ్ 2 లాంటి మూవీలతో పాటు తాజాగా విడుదలయి సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం కూడా కామెడీ ఎక్కువగా ఉండటం వల్లనే బాక్సాఫీస్ వద్ద మూవీ రికార్డులను బ్రేక్ చేయగలిగింది.
కామెడీ ట్రాక్ లోనే అయితే...
వెంకటేశ్ కూడా అదే కోరుకుంటున్నారు. తన వయసుకు సంబంధించిన స్టోరీలలో కామెడీ నప్పుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అలాంటి కథలు, దర్శకులను ఎంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరొక వార్త చక్కర్లు కొడుతుంది. విక్టరీ వెంకటేశ్ తర్వాత మూవీ ఎవరితో అన్న అనుమానానికి తెరదించేలా ఈ ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వెంకటేశ్ తదుపరి చిత్రానికి దర్శకుడు కూడా డిసైడ్ అయిపోయారు. ఆయన తివిక్రమ్ శ్రీనివాస్. తివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత క్రియేటివిటీ ఉన్న దర్శకుడిగా మారాడు.
తదుపరి చిత్రంతో...
తాజాగా అందుతున్న కబురు ప్రకారం విక్టరీ వెంకటేశ్ తదుపరి చిత్రం తివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందన్న టాక్ నడుస్తుంది. వెంకటేశ్, తివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య కథకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అయితే త్వరలోనే దీనికి క్లాప్ కొట్టే అవకాశముందని కూడా టాలీ వుడ్ నుంచి వినిపిస్తున్న టాక్. ఇద్దరి కాంబినేషన్ లో గతంలో మూవీ రాకపోయినా మల్లీశ్వరి, నువ్వునాకు నచ్చావ్ మూవీలకు తివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పనిచేశాడు. ఆ మూవీలు కూడా డైలాగ్స్ తోనే హిట్ అందుకున్నాయి. ఇప్పుడు నేరుగా దర్శకత్వంతో వెంకటేశ్ తో మూవీ తీయాలని భావించి కథ రెడీ చేస్తున్నారట. ఈ మూవీకి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుందని కూడా అంటున్నారు. అదే జరిగితే మరోసారి ఈ కాంబినేషన్ లో నవ్వులు పూయించే సినిమా మన ముందుకు రావడం ఖాయమని చెప్పకతప్పదు.
Next Story