Mon Dec 29 2025 06:40:41 GMT+0000 (Coordinated Universal Time)
సవ్యసాచి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు!!

నాగ చైతన్య - నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమిళ హీరో మాధవన్ విలన్ గా నటించిన సవ్యసాచి చిత్రం రేపు నవంబర్ 2 న వరల్డ్ వైడ్ గా విడుదలకాబోతుంది. నాగ్ చైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమా యావరేజ్ తరవాత విడుదలవుతున్న ఈచిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వం, ఆర్ మాధవన్ ఈ సినిమాలో నటించడం వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఉన్న ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటుగా అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మీదున్నఅంచనాలతో సవ్యసాచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఆ వివరాలు మీకోసం...
ఏరియా బిజినెస్ (కోట్లలో)
నైజాం 6.50
సీడెడ్ 3.07
వైజాగ్ 2.50
ఈస్ట్ గోదావరి 1.50
వెస్ట్ గోదావరి 1.07
గుంటూరు 1.70
కృష్ణ 1.20
నెల్లూరు 0.70
కర్ణాటక 2.00
ఓవర్సీస్ 3.52
టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 23.76 కోట్లు
Next Story
