Tue Feb 07 2023 15:59:43 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేసింది ! ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ !
ఇంతకీ ట్రైలర్ లో ఏం చూపించారన్న విషయానికొస్తే.. మహేష్ ను చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. అదే సమయంలో యాక్షన్ సీన్స్

హైదరాబాద్ : సూపర్ స్టార్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సర్కారువారిపాట సినిమా ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో మహేష్ ట్రైలర్ లో అదరగొట్టాడు. ఓవైపు యాక్షన్ సీన్స్.. మరోవైపు ప్రేమను సమానంగా చూపించారు మేకర్స్. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది సర్కారువారిపాట.
ఇంతకీ ట్రైలర్ లో ఏం చూపించారన్న విషయానికొస్తే.. మహేష్ ను చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. అదే సమయంలో యాక్షన్ సీన్స్ లోనూ ఏమాత్రం తగ్గలేదు. నువ్వు నా ప్రేమను దొంగిలించగలవ్.. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్.. కానీ నువ్వు నా డబ్బు దొంగిలించలేవన్న డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. అమ్మాయిలను, ఇప్పు ఇచ్చేవాళ్లను పాంపర్ చేయాలిరా. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు అన్న డైలాగ్ బావుంటుంది. కీర్తి- మహేష్ ల మధ్య వచ్చే లవ్ సీన్స్, వెన్నెల కిషోర్ కామెడీని ట్రైలర్ లో చూపించారు.
మొత్తంగా సర్కారువారిపాట ట్రైలర్ లో కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నింటినీ చూపించారు. సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెలకిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంసీ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా.. అనంత శ్రీరామ్ అన్ని పాటలకు లిరిక్స్ రాశారు. కాగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా.. పెన్నీ సాంగ్ లో సితార తండ్రి మహేష్ తో కలిసి స్టెప్పులేసింది.
News Summary - Sarkaruvari Pata Official Trailer Out Now
Next Story