విలన్ సెట్ అవకుండా అమెరికా వెళ్ళిపోతావా మహేష్!!
పరశురామ్ – మహేష్ బాబు కాంబోలో సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మహేష్ ఫాన్స్ తెగ వెయిటింగ్ లో ఉన్నారు. రామ్ చరణ్, [more]
పరశురామ్ – మహేష్ బాబు కాంబోలో సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మహేష్ ఫాన్స్ తెగ వెయిటింగ్ లో ఉన్నారు. రామ్ చరణ్, [more]
పరశురామ్ – మహేష్ బాబు కాంబోలో సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మహేష్ ఫాన్స్ తెగ వెయిటింగ్ లో ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లు తమ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. కానీ మహేష్ ఇప్పటి వరకు యాడ్స్ షూట్ అంటున్నాడు కానీ సర్కారు వారి పాట షూటింగ్ మొదలుపెట్టలేదు. ఏమంటే అమెరికా వీసా ప్రోబ్లెంస్ అంటున్నారు. అయితే తాజాగా అమెరికా వెళ్లేందుకు సర్కారు వారి పాట టీం రెడీ అవుతుంది. అయితే అది డిసెంబర్ చివరి వారంలో అమెరికా ప్రయాణం ఉంటుంది అంటున్నారు.
మరి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి అయినా మహేష్ విలన్ ని పరశురామ్ ఫైనల్ చేస్తాడా అంటున్నారు. అరవింద్ స్వామి, ఉపేంద్ర అంటూ ప్రచారం జరుగుతున్నా మూవీ యూనిట్ మాత్రం ఇంకా మహేష్ సర్కారు వారి పాట విలన్ ని ఫైనల్ చెయ్యలేదు. మరి విలన్ ని ఫైనల్ చెయ్యకుండానే మహేష్ అమెరికా వెళ్ళిపోతాడట. అయితే మూవీ టీం కన్నా ముందే మహేష్ తన ఫ్యామిలీతో అమెరికా టూర్ ప్లాన్ చేసాడట. గౌతమ్, సితార, నమ్రతలతో మహేష్ అమెరికాలో క్రిష్ట్మస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి రేడి అవుతున్నాడట. మహేష్ వెళ్లిన రెండు రోజులకి సర్కారు వారి పాట టీం కూడా అమెరికా పయనమవుతుంది అంటున్నారు.