Sat Dec 07 2024 17:22:24 GMT+0000 (Coordinated Universal Time)
Sarfira Movie: అక్షయ్ కుమార్ సినిమా.. వెళ్తే సమోసా, టీ.. బ్యాగ్ కూడా ఇస్తారు
అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా సినిమాకు అనుకున్నంత కలెక్షన్స్ రావడం లేదు
అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా సినిమాకు అనుకున్నంత కలెక్షన్స్ రావడం లేదు. శనివారం, ఆదివారం దేశీయ బాక్సాఫీస్ వద్ద కాస్త పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. సానుకూల సమీక్షలు ఉన్నప్పటికీ థియేటర్ కు ఆడియన్స్ చాలా తక్కువగా వస్తున్నారు. ఆకాశమే నీ హద్దురా రీమేక్ కావడంతో అందరూ ఓటీటీలో ఈ సినిమాను బాగా చూసారు. అందుకే ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా పెద్దగా రీచ్ అవ్వలేకపోతోంది. ఈ చిత్రం ప్రారంభ వారాంతంలో కేవలం ₹10 కోట్ల మార్కును దాటింది.
సర్ఫిరా రోజువారీ కలెక్షన్లలో ఆదివారం కేవలం 20 శాతం పెరిగింది. ఈ చిత్రం ఆదివారం దాదాపు ₹5.1 కోట్లు వసూలు చేసింది, మొత్తం ₹12.1 కోట్లకు చేరుకుంది. మూడో రోజు మార్నింగ్ షోలకు 9.47 శాతం ఆక్యుపెన్సీతో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం నుంచి కాస్త ఫుట్‌ఫాల్ పెరిగింది. ఆదివారం నాడు సర్ఫిరా మొత్తం 26.46 శాతం హిందీ ఆక్యుపెన్సీని కలిగి ఉంది, చెన్నైలో అత్యధికంగా నివేదించబడింది 40.75 శాతం ఉండడం విశేషం.
ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి థియేటర్ యాజమాన్యం బాగా ప్రయత్నిస్తోంది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు టీ, సమోసాలను ఇస్తున్నారు. ‘పీవీఆర్ ఐనాక్స్’ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలిపింది. సర్ఫిరా మూవీ చూసేందుకు వెళ్లే వారికి 2 సమోసాలు, 1 టీ, 1 లగేజీ ట్యాగ్ ఫ్రీ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అబుందాంటియా ఎంటర్టైన్మెంట్, 2డి ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ నిర్మించాయి. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు రాధిక మదన్, పరేష్ రావల్, సీమా బిస్వాస్ కీలక పాత్రల్లో నటించారు.
Next Story