Thu Mar 19 2026 04:26:42 GMT+0530 (India Standard Time)
నేడు శరత్ బాబు అంత్యక్రియలు.. టీ నగర్ కు భౌతికకాయం
వరుసగా సినీ ప్రముఖులు స్వర్గస్తులవడంతో.. వారితో పనిచేసిన నటీనటులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నటుడు శరత్ బాబు..

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న సంగీత దర్శకుడు రాజ్, నిన్న శరత్ బాబు మరణాలతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వరుసగా సినీ ప్రముఖులు స్వర్గస్తులవడంతో.. వారితో పనిచేసిన నటీనటులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నటుడు శరత్ బాబు సోమవారం (మే22) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో మృతిచెందగా.. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. అనంతరం చెన్నైకి తరలించారు.
నేడు చెన్నైలోని టీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంది. నేటి మధ్యాహ్నం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 200కు పైగా చిత్రాల్లో హీరోగా, విలన్ గా, తండ్రిగా, కొడుకుగా పలు పాత్రలో పోషించి.. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు. నిజజీవితంలో మాత్రం ఆయనకంటూ ఒక కుటుంబం, పిల్లలు లేరు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నారు. సోదరుడి పిల్లల్నే తన పిల్లలుగా చూసుకునేవారు శరత్ బాబు.
Next Story

