Fri Dec 05 2025 12:23:45 GMT+0000 (Coordinated Universal Time)
Sandeep Vanga : సందీప్ వంగా ఆమెనే ఎంచుకోవడం వెనక ఇంత కథ ఉందా?
దర్శకుడు సందీప్ వంగా మరో అందమైన నటికి తన మూవీలో అవకాశం ఇవ్వనున్నారు. 8 వసంతాలు ఫేమ్ అవంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్ గా సందీప్ వంగా ఎంపిక చేశారు

దర్శకుడు సందీప్ వంగా మరో అందమైన నటికి తన మూవీలో అవకాశం ఇవ్వనున్నారు. 8 వసంతాలు ఫేమ్ అవంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్ గా సందీప్ వంగా ఎంపిక చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో టాలీవుడ్, బాలీవుడ్ ను షేక్ చేసిన సందీప్ వంగా తన నిర్మాణ సారధ్యంలో చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్న సందీప్ వంగా తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పై ఒక మూవీని నిర్మిస్తున్నాడు.
కొత్త దర్శకుడితో...
ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వేణును పరిచయం చేయనున్నట్లు తెలిసంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం లవ్ స్టోరీగా ఉంటుందన్న టాక్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో అవంతిక హీరోయిన్ గా, హీరోగా మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ను సందీప్ వంగా ఎంపిక చేసినట్లు ఫిలింనగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రధాన పాత్రలను ఎంపిక పూర్తయినట్లు సమాచారం. కధతో స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా అంటున్నారు.
మళయాళీ భామ...
అవంతిక సనీల్ కుమార్ మ్యాడ్ సినిమాతో్ ఫేమస్ అయింది. టాలీవుడ్ లో ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 8 వసంతాలు సినిమాతో మరింత పాపులర్ అయింది. ఈ మూవీలో అవంతిక సనీల్ కుమార్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఆమె చిన్న వయసులోనే కరాటే, కళరిపయట్టు, కత్తిసాము వంటి విద్యల్లో ప్రావీణ్యం పొందడమే కాకుండా నటనతో కూడా నెంబర్ వన్ అని దర్శకులు మెచ్చుకుంటును్నారు. కేరళకు చెందిన ఈ మళయాళీ బ్యూటీని సందీప్ వంగా సినిమాతో టాలీవుడ్ లో మరింతగా పాపులర్ అవుతుందంటున్నారు.
Next Story

