Thu Mar 19 2026 11:19:11 GMT+0530 (India Standard Time)
ప్రముఖ నిర్మాత కన్నుమూత
ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసీఎన్ మోహన్ మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు..

కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కేసీఎన్ మోహన్ (61) బెంగళూరులోని ఆయన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసీఎన్ మోహన్ మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన నిర్మాతగా ఉన్న సినిమాలు వరుస విజయాలు సాధించాయని కన్నడ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. కేసీఎన్ మోహన్ మరణంపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కేసీఎన్ మోహన్ కు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతేడాది ఆయన సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మృతి చెందారు. ఆ లోటు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుటుంబ సభ్యులకు.. కేసీఎన్ మోహన్ మరణం మళ్లీ విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతిని తట్టుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా.. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూసినట్లు సమాచారం.
Next Story

