Sun Mar 08 2026 05:44:23 GMT+0530 (India Standard Time)
చైతూని అన్ ఫాలో చేసిన సామ్.. ఫ్రెండ్షిప్ కూడా కట్?
విడాకుల ప్రకటన చేసి 5 నెలలైనా ఇంతవరకూ వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్న విషయం ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఈ విషయంపై..

హైదరాబాద్ : టాలీవుడ్ లోనే అందమైన జంటగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంతలు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ అభిమానులకు ఊహించని షాకిచ్చిన విషయం తెలిసిందే. విడాకుల ప్రకటన చేసి 5 నెలలైనా ఇంతవరకూ వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్న విషయం ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఈ విషయంపై అభిమానుల్లోనూ సందిగ్ధం వీడలేదు. తాజాగా.. సమంత చైతన్యను ఇన్ స్టా లో అన్ ఫాలో చేసింది.
దాంతో వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే.. చైతన్య బంధువులైన వెంకటేశ్, రానా, నాగార్జున, అశ్రితలను మాత్రం సమంత అన్ ఫాలో చేయలేదు. సమంత అన్ ఫాలో చేసినా.. చైతూ మాత్రం సామ్ ను ఫాలో అవుతున్నాడు. అలాగే ఆమెతో కలిసి ఫొటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించలేదు. విడాకులు ప్రకటించిన తర్వాత తమ ఇన్ స్టా ఖాతా నుంచి చైతూ ఫొటోలను సమంత తొలగించింది.
Next Story

