Thu Dec 05 2024 16:03:26 GMT+0000 (Coordinated Universal Time)
శాకుంతలం రిలీజ్ డేట్ వచ్చేసింది..
తాజాగా.. సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా..
చైతూతో విడాకులు పొందిన చాలా గ్యాప్ తర్వాత గతేడాది.. యశోదతో వచ్చి.. ఆడియన్స్ ని మెప్పించింది సమంత. ఆమె మెయిన్ లీడ్ లో.. సరోగసి స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. థియేట్రికల్ రన్ లో రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యశోద విడుదలకు ముందు.. తనకు అరుదైన మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆ విషయం తెలిసినప్పటి నుండి సమంత ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతతున్నారు. ప్రస్తుతం సమంత ఇంట్లోనే చికిత్స తీసుకుంటుండగా.. అభిమానులు, ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
తాజాగా.. సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా.. శాకుంతలం టైటిల్ తో.. సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ఇది. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు శాకుంతల చిన్నప్పటి పాత్రలో.. వెండితెరకు అరంగేట్రం ఇవ్వనుంది. ఇక దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. 2023 ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాని పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలుపుతూ.. ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే.. ఈ సినిమాను 3డిలో కూడా విడుదల చేయనున్నారు.
Next Story