Fri Dec 05 2025 17:42:54 GMT+0000 (Coordinated Universal Time)
దసరాకి వచ్చిన సినిమా అప్డేట్స్ ఇవే..
ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు నుంచి కూడా కొత్త అప్డేట్స్ వచ్చాయి.

దసరా పండుగా సందర్భంగా టాలీవుడ్ సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇక నిన్న ప్రభాస్ పుట్టినరోజు కూడా కావడం మరో విశేషం. 'సలార్' నుంచి వెపన్స్ పోస్టర్, 'కల్కి 2898 AD' నుంచి ఫస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. అయితే వీటితో ప్రభాస్ అభిమానులు ఖుషి ఫీల్ అవ్వలేదు. ప్రభాస్ బర్త్ డేకి కూడా సరైన అప్డేట్ ఇవ్వలేదని మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇతర సినిమాల గుర్తించి మాట్లాడుకుంటే.. చిరంజీవి 156 అప్డేట్, పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్స్, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్, ఎన్టీఆర్ 'దేవర' వెపన్ పోస్టర్, మహేష్ బాబు 'గుంటూరు కారం' పోస్ట్. అలాగే మరికొన్ని చిత్రాలు నుంచి కూడా కొత్త అప్డేట్స్ వచ్చాయి వాటి వైపు కూడా ఒక లుక్ వేసేయండి.
Next Story

