Wed Dec 17 2025 14:14:19 GMT+0000 (Coordinated Universal Time)
రాజమౌళి సంబరం చూశారా?
RRR మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆస్కార్ అవార్డు రావడంతో సంబరపడి పోయారు

RRR మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆస్కార్ అవార్డు రావడంతో సంబరపడి పోయారు. గతకొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డు కోసం శ్రమిస్తున్న రాజమౌళి ఈ అవార్డు దక్కడంతో చిన్న పిల్లాడిలా సంబరపడి పోయారు. మురిసి పోయారు. అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ తనకు ఇదంతా ఒక కలలా ఉందని అన్నారు. నమ్మలేకపోతున్నానని రాజమౌళి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
అత్యున్నత శిఖిరాన...
అయితే అవార్డు వస్తుందని నమ్మకంతో ఉన్నామని, జీవితంలో అత్యంత అమూల్య మైన ఘటన అవార్డును గెలుచుకోవడమా? లేక ఆస్కార్ ఫంక్షన్ లో పాటను ప్రదర్శించడమా? అన్న ప్రశ్నకు రెండింటిలో ఒక్కదానిని ఎంపిక చేసుకోవడం కష్టమేనని అంటున్నారు. రెండూ తన జీవితంలో మరచిపోలేని ఘట్టాలని, ఆ పాట ప్రదర్శన జరుగుతున్నంత సేపూ ప్రేక్షకులు చప్పట్లు కొట్టారన్నారు. పాట పూర్తయిన తర్వాత ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం చూస్తే అత్యున్నత శిఖరం అధిరోహించినట్లుందని ఆయన అన్నారు.
Next Story

