Tue Dec 16 2025 23:37:01 GMT+0000 (Coordinated Universal Time)
RRR ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ? ఎక్కడ ?
కొద్దిరోజులుగా కర్ణాటకలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగనుందంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా అందుకు సంబంధించి..

బెంగళూరు : RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభమవ్వగా.. చరణ్, తారక్, రాజమౌళి లు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. RRR పై హైప్స్ పెంచే పనిలో పడ్డారు. ఇక మార్చి 25న తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. కన్నడ, తెలుగు మినహా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటికే ప్రీ-రిలీజ్ ఈవెంట్లు జరిగిపోయాయి.
కొద్దిరోజులుగా కర్ణాటకలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగనుందంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మేరకు ప్రకటన చేసింది. మార్చి 19న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో సాయంత్రం 6 గంటలకు RRR కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఇందుకు సంబంధించి కేవీఎన్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసుల కోసం kvnproductions.co.in లోకి లాగ్ ఇన్ అవ్వాలని సూచించారు. ఈవెంట్ తేదీ, ప్లేస్ చెప్పారు గానీ.. అతిథులెవరన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. కానీ.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం.
Next Story

